South Cinema

Boyapati to present Ram Charan in a class look

బోయపాటి చరణ్ ను క్లాస్ గా చూపించబోతున్నాడు !

Boyapati to present Ram Charan in a class look

రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌హిట్‌ తరువాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను నవంబర్ 6న విడుదల చెయ్యబోతున్నారు. ఫస్ట్ లుక్ లో చరణ్ క్లాస్ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ చరణ్ లుక్ కు ఫిదాఅవ్వడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

 

మాస్ సినిమాలు చేసే దర్శకుడు చరణ్ ను సినిమా మొత్తం క్లాస్ లుక్ లో చూపిస్తున్నాడనుకుంటే పొరపాటు పడినట్లే. నవంబర్ 9న విడుదల చేయబోయే టీజర్ మాస్ గా ఉంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

Facebook Comments
Share