Trivikram to work with Kiara Advani finally

త్రివిక్రమ్ కు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది !

ఇటీవల బాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన సోను కే టిటు కీ స్వీటీ సినిమాను బన్నీ తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాకే కైరా అద్వానిని తీసుకుందాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కుదిరింది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్న ఈ సినిమాలో భారీ తారాగణం పాల్గొనబోతున్నారు.

అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ కథ రాసి సినిమా చెయ్యాలంటే మరో ఆరు నెలలు పడుతుంది కావున రీమేక్ చేస్తే తక్కువ టైమ్ లో సినిమా మొదలు పెట్టొచ్చని రీమేక్ తో వెళ్దాం అనుకున్నారట. బన్నీ కూడా రెండు ఫ్లాప్స్ తరువాత డైరెక్ట్ సబ్జెక్టు చెయ్యడం కంటే రీమేక్ అయితే బాగుంటుందని భావించారట. అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండగా అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతోనైనా బన్నీ హిట్ కొడతాడేమో చూద్దాం.

Facebook Comments
Share

This website uses cookies.