Heroine troubles for Venkatesh

వెంకటేష్ కు హీరోయిన్ కస్టాలు !

వెంకటేష్, నాగ చైతన్య మల్టీ స్టార్రర్ సినిమాకు వెంకీ మామ టైటిల్ ఖరారు చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన రకుల్నటిస్తోంది. వెంకటేష్ కు జోడీగా ముందుగా హుమా కూరేషీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఎక్కువగా డిమాండ్ చెయ్యడంతో ఆమె స్థానంలో వేరే హీరోయిన్ ను చూస్తున్నారు. వెంకటేష్ పక్కన నటించడానికి కొంచం సక్సెస్ లో ఉన్న ఏ హీరోయిన్ ఒప్పుకోవడం లేదు కనుక షూటింగ్ ఆలస్యం అవుతోంది.

ఈ చిత్రం ఆగిపోయిందాఅనే అనుమానాలు వచ్చాయి. చివరికి చిత్ర యూనిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి స్టార్ట్ కానుందని వెల్లడించింది. సినిమాలో కూడా వెంకటేష్, చైతు మామ అల్లుళ్లుగా కనిపించబోతుండడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రావ్రమేశ్, పృధ్వీ, పోసాని వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.