Mahesh, Sukumar movie canceled?

మహేశ్ బాబు, సుకుమార్ సినిమా క్యాన్సల్ ?

మహేశ్ బాబు తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో చెయ్యబోతున్నట్లు భరత్అనే నేను సినిమా ప్రమోషన్స్ లో చెప్పడం జరిగింది. కానీ ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ చెప్పిన పాయింట్ మహేశ్ కు పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది. అందుచేత ముందుగా సందీప్ రెడ్డి వంగ సినిమా చేయాలని మహేశ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.

మహేశ్ నటిస్తున్న 25వ సినిమా కావడంతో ఈ చిత్రాన్ని ప్రతిస్తాత్మకంగా నిర్మిస్తున్నారు. మహేశ్ బాబు, సుకుమార్ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సుకుమార్ ఇటీవలే చరణ్ తో రంగస్థలం సినిమా తీసి పెద్ద విజయం సాదించిన సంగతి తెలిసిందే.

Facebook Comments
Share

This website uses cookies.