CBN Biopic Chandrodayam completes shoot, Team meets Chandrababu Naidu

చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం" చంద్రోదయం".
.ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తి చెసుకుంది. ఇటివలే ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసారు యూనిట్.

ఈ సందర్భంగాదర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. "ఆకులు ఎన్ని కాల్చిన బొగ్గులు కావు బ్రదర్ . జిత్తులమారి నక్కలు , తోడేళ్ళు ఎన్ని ఏకమైనా అడవికి రాజు , మృగరాజు న అల్లుడే " అనే ఎన్టీఆర్ క్యారెక్టర్ డైలాగ్ తో షూటింగ్ విజయవాడ లో పూర్తి అయ్యింది . చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలొనె ఆదర్శవంతమైన నాయకుడు. ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నాము. చిత్రీకరణ పూర్తిచేశాము. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైన స్దాయికి చెరిన ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా తెరమీదకు తీసుకువస్తున్నామని"న్నారు.

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ..నారా వారి పల్లె, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లో సినిమా షూటింగ్ చెశాము. మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది. పాటలను నవంబర్ 2 వ వారంలొ విడుదల చెస్తాము. సంక్రాంతి కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.