Did Devi Sri Prasad take up the mega project for Sukumar?

దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ కోసం ఒప్పుకున్నాడు !

రంగస్థలం సినిమా తరువాత దేవి శ్రీ ప్రసాద్ కొంచం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల దేవిని సంగీతం చెయ్యమని రవితేజ సినిమా వాళ్ళు అడిగారు. ఈ సినిమాకు వి.ఐ.ఆనంద్ దర్శకుడు, కానీ దేవి సినిమా చెయ్యడానికి 2 కోట్లు అడిగినట్లు సమాచారం. అందుచేత వారు తమన్ తో వర్క్ చేయించుకుంటున్నారు. అలాగే వెంకటేష్, నాగ చైత్యన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు దేవిని అడిగారు కానీ దేవి చేయనని చెప్పాడు. అందుకు కారణం దేవి అడిగిన అమౌంట్ వారు ఇవ్వకపోవడమే.

లేటెస్ట్ గా దేవి ఒక సినిమా ఒప్పుకున్నాడు, సుకుమార్ నిర్మాతగా సాయి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు దేవి సంగీతం అందించబోతున్నాడు. పెద్ద హీరోల సినిమాలు వదిలేసి కొత్త హీరో సినిమా చెయ్యడానికి కారణం కేవలం సుకుమార్ నిర్మాత కావడమే అంటున్నారు జనాలు. సుకుమార్ అన్నీ సినిమాలు దేవితో చేశాడు. ఆ రిలేషన్ మీద దేవి ఈ సినిమా ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

Facebook Comments
Share
More

This website uses cookies.