Still no clarity on Amar Akbar Anthony release date

రవితేజ సినిమా క్లారిటీ లేదు!

మూడు విభిన్న సేడ్స్ లో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ఎంటెర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత ఇలియానా చేస్తున్న తెలుగు సినిమా ఇదే అవ్వడం విశేషం. ఒక రివెంజ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శ్రీను చిత్రాల తరహాలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తరువాత రవితేజ వి.ఐ.ఆనంద్ సినిమా మొదలుకానుంది. ఈ చిత్ర టీజర్ను అక్టోబర్ 29 సాయంత్రం 4 గంటలకు విడుదల చెయ్యనున్నారు. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటీ లేదు, చిత్ర యూనిట్ గతంలో రెండుసార్లు విడుదల తేదీని ప్రకటించి వాయిదా వేసింది. టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుందేమో చూద్దాం.

Facebook Comments
Share

This website uses cookies.