South Cinema

7 Chepala Katha #MeToo Teaser will be released tomorrow at 5:01 pm

"ఏడు చేపల కథ" MeToo  టీజ‌ర్ రెపు సాయంత్రం 5.01 నిమిషాల‌కి విడుద‌ల

7 Chepala Katha #MeToo Teaser will be released tomorrow at 5:01 pm

"MeToo" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు "MeToo  " ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని బహిరంగంగా చెబుతూ కొంతమందికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ  టెమ్ట్ రవి మీటూ అంటూ ముందుకొస్తున్నాడు. "ఏడు చేపల కథ" చిత్రంలో టెమ్ట్ రవి కి  MeToo అని చెప్పిన హీరోయిన్ ఎవ‌రు.. అస‌లు  MeToo లొ టెమ్ట్ ర‌వి పాత్ర వుందా.. ఇన్ని ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానంగా రేపు సాయంత్ర 5.01 నిమిషాల‌కి టీజ‌ర్ లో చూపిస్తున్నారు.. పూర్తి అడల్డ్ కామెడీ జోనర్ లో కొత్త వారితో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో బిజినెస్ స‌ర్కిల్ లో హ్యూజ్ బ‌జ్ రావ‌టం విశేషం. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... "ఆడవాళ్ల మీద మగవారు చేసిన అఘాయిత్యాలు... ఆధారాలు లేకపోయినా, ఆరు సంవత్సరాల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి ఘీ పెట్టి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరపున  MeToo అంటూ టెమ్ట్ రవి అనే ప్రయోగాత్మక పాత్రను "ఏడు చేపల కథ" చిత్రంతో పరిచయం చేస్తున్నాం.  పూర్తి అడల్డ్ కామెడీ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రం యెక్క టీజ‌ర్ ని రేపు సాయంత్రం 5.01 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన లభించింది.  దర్శకుడు శామ్ జే చైతన్య విభిన్నమైన కాన్సెప్ట్ ను రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. ." అని అన్నారు.

నటీనటులు
అభిషేక్ రెడ్డి, భానుశ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ - చరిత సినిమా ఆర్ట్స్
సమర్పణ - డా.రాకేష్ రెడ్డి
నిర్మాతలు - శేఖర్ రెడ్డి, జివిఎన్
సహ నిర్మాత - గుండ్ర లక్ష్మీ రెడ్డి,
సంగీతం - కవి శంకర్,
కెమెరా - ఆర్లీ,
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
రచన, దర్శకత్వం - శామ్ జే  చైతన్య

Facebook Comments

About uma

Share