Rakul Preet Singh to do an item song in RC12

ఆ సినిమాలో రకుల్ ఐ‌టమ్ సాంగ్ !

డివివి దానయ్య బ్యానర్ లో చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దత్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు వినయ విధేయ రామ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళికి విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ ఐటెమ్ సాంగ్ చెయ్యబోతోందని సమాచారం. గతంలోనే ఆమె ఐటెమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ ఇంకా బెటర్ ఆప్షన్ కోసం వెయిట్చేశారు చివరికి రకుల్ ను ఖరారు చేసినట్లు చిత్ర వర్గాల నుండి వార్తా వినిపిస్తోంది.

కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రూపొందించబడిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకల ముందుకు రాబోతోంది. రంగస్థలం సినిమా తరువాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను తనదైన స్టయిల్ లో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించబోతున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Facebook Comments
Share
More

This website uses cookies.