Will Venkatesh work with a flop director?

ఫ్లాప్ డైరెక్టర్ తో వెంకటేష్ చేస్తాడా?

డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావ్ సినిమా చూపిస్తా మావా, నేను లోకల్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. తాజాగా ఈ డైరెక్టర్ తీసిన హలో గురు ప్రేమకోసమే సినిమా రొటీన్ గా ఉండడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ దర్శకుడు హలో గురు సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే వెంకటేష్ కు ఒక పోలీసు కథ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు హలో గురు సినిమా ఫ్లాప్ అవ్వడంతో వెంకటేష్ ఆ సినిమా చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు సినిమా రంగం మొత్తం హిట్ పైనే నడుస్తోంది. హిట్ లేకపోతే ఎవ్వరూ ఎవ్వరిని పలకరించారు. కావున ఈ దర్శకుడు మరే చిన్న హీరోతో హిట్ కొడితే పెద్ద హీరోలు అవకాశాలు ఇవొచ్చు. నేను శైలజ సినిమా తరువాత కిశోర్ తిరుమల చెప్పిన పాయింట్ నచ్చక సినిమా చేయలేదు వెంకీ, హిట్ కొట్టిన డైరెక్టర్ తో సినిమా అంటేనే ఆలోచిస్తారు, ఫ్లాప్ తీస్తే కస్టమే. మరి త్రినాధ్ రావ్ ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి. త్రినాధ్ రావ్ మామా, అల్లుళ్ళ కథలు పక్కన పెట్టి కొత్త కథలతో సినిమాలు చెయ్యడం బెటర్.

Facebook Comments
Share

This website uses cookies.