Saaho release date fixed?

సాహో విడుదల తేదీ ఖరారు అయ్యిందా ?

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సాహో మేకింగ్ లో పెద్దగా స్పెషల్ లేకపోయినా వీడియో చివర్ల్లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాహో సినిమాకు సంభందించి ఇప్పడికే రెండు టీజర్స్ విడుదల చేశారు. కానీ విడుదల తేదీకి సంభందించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం మేరకు 2019 మే నెలలో చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పోలిసే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరుకు ఈ చిత్రం దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది.

Facebook Comments
Share

This website uses cookies.