Vijay Deverakonda new movie based on real life incidents!!

యదార్థ సంఘటనల ఆధారంగా విజయ్ దేవరకొండ సినిమా !

యువ హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు క్రాంతి మాధవ్‌ కాంబినేషన్‌లో ఓ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ముహూర్తం జరుపుకుంది. ఈ సినిమాను క్రియేటీవ్‌ కమర్షియల్స్‌ బ్యానర్ లో కె.ఎస్.రామరావ్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను నిజజీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించబోతున్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. రియల్ లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీ ను రీల్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు క్రాంతి మాధవ్..

ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందుస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీ వాలా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విజయ్ నటించిన నో టా సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది కావున విజయ్ కథల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది.

Facebook Comments
Share

This website uses cookies.