South Cinema

Venkatesh suggests changes to the second half

సెకండ్ హాఫ్ లో మార్పులు చెప్పిన వెంకటేష్ !

Venkatesh suggests changes to the second half

గురు చిత్రం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ప్ర‌స్తుతం రెండు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్స్ చెయ్యడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఎఫ్ 2 సినిమా,బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో మ‌ల్టీ స్టార‌ర్. నాగ చైతన్య తో కలిసి బాబీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి కానీ సినిమా షూటింగ్ మొదలవ్వలేదు. బాబీ చెబుతున్న పాయింట్ వెంకటేష్ కు నచ్చడం లేదని, సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చెయ్యమని వెంకీ అడిగినట్లు సమాచారం.

 

ఈ చిత్రంలో నాగ చైతన్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. గతంలో వీరు రారండోయ్ వేడుక చూద్ధాం చిత్రంలో న‌టించారు. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌డం రెండోసారి. వెంకటేష్ తో నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు పాపుల‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ సంస్థ అయిన కోన ఫిలిం కార్పొరేష‌న్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. బాబీ ఫైనల్ వెర్సెన్ నరేషన్ ఈ వారంలో ఇవ్వబోతున్నదని అంటున్నారు. ఈ నరేషన్ నచ్చితే సినిమా సెట్స్ మీదకు వెళ్లాడమే.

Facebook Comments
Share