Mega Hero to do a triangular love story!!

ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మెగా హీరో !

వరుసగా ఆరు ఫ్లాపులు రావడం మాట అటుంచితే పాతిక కోట్ల మార్కెట్‌ వున్న హీరోకి కనీసం అయిదు కోట్ల షేర్‌ కూడా రాకపోవడం మాత్రం షాకింగే. వరుసగా ఇంటిలిజెంట్‌, తేజ్‌ చిత్రాలకి నాలుగు కోట్ల లోపే షేర్‌ రావడంతో సాయి ధరమ్‌ తేజ్‌ కుదేలయ్యాడు. ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో సాయికి అర్జెంట్ గా హిట్ కావాలి. లేదంటే అతని మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. నానితో కథాపరంగా ఇబ్బందులు తలెత్తడం వల్లే దర్శకుడు కిషోర్‌ తిరుమల వచ్చి తేజ్‌కి కథ చెప్పాడు. సాయికి ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను ఈరోజు (సోమవారం ) ప్రారంభించాడు..

వరుసగా తగిలిన దెబ్బలతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని సాయి భావిస్తున్నాడు. హలో చిత్రంలో నటించిన కల్యాణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంది. కానీ ఇంకా ఖరారు కాలేదు. త్వరలో ఒక హీరోయిన్ ను ఫిక్స్ చేసి అనౌన్స్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నదని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.