Samantha is demanding one crore now

సమంత ఇప్పుడు కోటి తీసుకుంటుంది !

సమంత త్వరలో నదిని రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోటి రూపాయలను డిమాండ్ చేస్తోందట సమంత. లేడి ఓరియంటెడ్ సినిమా కావున ఇంత భారీ అమౌంట్ డిమాండ్ చేస్తోందని సమాచారం. తాజాగా ఆమె నటించిన యు టర్న్ సినిమా విజయం సాధించడంతో ఆమె ర్యెమ్మునరేషన్ అమాంతంగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారు. ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేశ్ బాబు నిర్మించబోతున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

గతంలో సమంత జబర్దస్ట్ సినిమాలో సమంత సిద్ధార్థ్ తో నటించింది. ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెద్దగా ఈ మూవీ గురించి తెలీదు. ఆ సినిమా తరువాత నందిని రెడ్డి సమంతతో సినిమా చేస్తుండడం విశేషం. నందిని రెడ్డి సమంతను 70 ఏళ్ల ముసలావిడగా చూపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది

Facebook Comments
Share

This website uses cookies.