Trivikram hasn’t changed at all

త్రివిక్రమ్ అస్సలు మారలేదు !

దర్శకుడు త్రివిక్రమ్ చేసిన సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది, ఆజ్ఞతవాసి సినిమాల్లో హీరోయిన్ ఇద్దరు వుంటారు వారిద్దరూ అక్కా, చెల్లెళ్ళు. అరవింద సమేత సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ అక్క, చెల్లెళ్ళు అవ్వడం విశేషం. ఎన్టీఆర్ పూజను ప్రేమిస్తే తన చెల్లెలు ఇషా రెబ్బా ఎన్టీఆర్ ను ప్రేమిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా లవ్ ట్రాక్ ఉండబోతోందని సమాచారం.

త్రివిక్రమ్ సినిమాల్లో కథలు కొత్తగా ఉండవు కానీ చూపించే విధానం కొత్తగా కామెడీగా పంచ్ డైలాగులతో ఉండడంతో సినిమాలు విజయాలు సాధిస్తూ ఉంటాయి. కానీ ఆజ్ఞతవాసి సినిమాలో కథ, కథనం పాతగా ఉన్నాయి కావున ఆ చిత్రాన్ని ప్రేక్షకులు అలరించలేదు. అరవింద సమేత సినిమాలో కథ కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే ఫ్రెస్ గా ఉండబోతోందని సమాచారం.

సునీల్ ఈసారి పూర్తి స్థాయిలో ఆకట్టుకోబోతున్నాడని అంటున్నారు. జగపతిబాబు, నాగబాబు పాత్రలను త్రివిక్రమ్ కొత్తగా ఆవిష్కరించబోతున్నాడని టాక్. ఆంధ్రాలో ఉదయం 5 గంటలకు షోస్ వేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణాలో మిడ్ నైట్ నుండి షోస్ పడే అవకాశాలు ఉన్నాయి.

Facebook Comments
Share

This website uses cookies.