South Cinema

Aravindha Sametha carrying poor reports

అరవిందకు నెగిటివ్ రిపోర్ట్స్ !

Aravindha Sametha carrying poor reports

ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న అరవింద సమేత సినిమా సెన్సార్ పూర్తి పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో ఎక్కువ వాయిలెన్స్ ఉందని సమాచారం. ఇంటర్వెల్ ముందు మూడు ఫైట్స్ తరువాత మరో మూడు ఫైట్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రాయలసీమలో జరిగే ప్యాక్షన్ ను పూర్తి స్థాయిలో నిర్ములించే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారట దర్శకుడు త్రివిక్రమ్.

 

గతంలో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అరవింద సమేత సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోందనే న్యూస్ బయట వినిపిస్తోంది. సినిమా ఇలా రొటీన్ గా ఉంటే ప్రేక్షకులు చూడ్డం కష్టమే. కథ పాతగా ఉన్నా కథనం కొత్తగా ఉంటే సినిమా ఆడుతుంది. సెన్సార్ రిపోర్ట్స్ అయితే పూర్ గా ఉన్నాయి మరి సినిమా ఏ విధంగా ఉండబోతోందో తెలియాలంటే అక్టోబర్ 11 వరుకు ఆగాల్సిందే.

Facebook Comments
Share