South Cinema

NTR about his next movie with Rajamouli..

రాజమౌళి సినిమా గురించి ఎన్‌టి‌ఆర్ !

NTR about his next movie with Rajamouli..

అరవింద సమేత సినిమా విడుదల తరువాత ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవడానికి బయటి దేశాలకు వెళ్లబోతున్నాడు ఎన్‌టి‌ఆర్. ఆ తరువాత రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు ఎన్‌టి‌ఆర్. రాజమౌళి ప్రస్తుతం చిత్ర నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్‌టి‌ఆర్ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ... ''ఆ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. చిత్రం గురించి పూర్తి వివరాలు తెలీదు. జక్కన్న జస్ట్ ఐడియా చెప్పాడు'' అన్నారు. ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

 

అరవింద సమేత సినిమా సెన్సర్ సోమవారం పూర్తి కానుంది. ఇప్పటికే సినిమాకు అన్నీ ఏరియాల్లో బిజినెస్ పూర్తి అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రెయిలర్, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకరకంగా సినిమాకు ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్స్ బాగా వస్తాయి కావున హిట్ టాక్ వస్తే సినిమాకు మంచి వసూళ్లు వస్తాయి. ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాతో విజయం సాధిస్తాడో ? లేదో ? చూడాలి.

Facebook Comments
Share