South Cinema

Vijay Antony’s Roshagadu movie theme song released by Devi Sri Prasad

"రోషగాడు" థీమ్ సాంగ్ విడుదల

Vijay Antony’s Roshagadu movie theme song released by Devi Sri Prasad

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం "రోషగాడు". ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ థీమ్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చెశారు. "రోషగాడు రా..వీడు మాటంటే పడడురా "

 

అంటూ భాష్య శ్రీ రాసిన లిరిక్ తో ఆద్యంతం ఆకట్టుకునెలా రోషగాడు థీమ్ సాంగ్ విడుదలైంది. విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా , ఫైట్ మాస్టర్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న "రోషగాడు" అతి త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ, సంగీతం: విజయ్ ఆంథోని నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష ,

 

Facebook Comments

About uma

Share