South Cinema

NOTA release postponed?

నోటా విడుదల వాయిదా ?

NOTA release postponed?

హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందుకు విజయవాడలో, హైదరాబాద్ లో ర్ చిత్ర ప్రీ రిలీస్ ఈవెంట్స్ ను జరిపారు. కన్నడలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ నోటా చిత్ర ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోతాడు. పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తోన్న ర్ సినిమా హిట్ సాధిస్తుందని విజయ్ నమ్మకంగా ఉన్నాడు.

 

విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. కానీ సినిమా సెన్సార్ ఇంకా పూర్తి అవ్వలేదు. తమిళ్ లో యు సట్టిఫికెట్ ఇచ్చారు కానీ తెలుగులో ఇంకా సెన్సార్ పూర్తి అవ్వలేదు. తెలంగాణలో బిజెపి నేతలు సినిమా సెన్సార్ ను అడ్డుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ అవ్వకపోతే సినిమాను విడుదల చెయ్యలేరు.మరి ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 5న విడుదల అవుతోందా ? వాయిదా పడనుందా తెలియాల్సి ఉంది.

Facebook Comments
Share