Heroine role is key in Aravindha Sametha !!!

అరవింద సమేత లేటెస్ట్ న్యూస్ !

అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద సమేత సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ పూజా హెగ్డే, ఇషా రెబ్బ అక్క చెల్లెళ్ళుగా నటించారని సమాచారం. వీరిద్దరూ జగపతి బాబుకు కూతుళ్ళుగా కనిపించబోతున్నారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండబోతున్నాయని సమాచారం. టైటిల్ లో హీరోయిన్ పేరు ఉందంటే అర్థం చేసుకోవచ్చు హీరోయిన్ కు ఎంత ప్రాముఖ్యత ఉందొ.

ట్రైలర్, పాటలకు అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అన్నది వాస్తవం. సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందని అంటున్నారు చిత్ర యూనిట్. కథ జరుగుతున్న సమయంలో పాటలు వచ్చి ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చిత్రలో పాటలు ఎక్కువగా లేవని అంటున్నారు. త్రివిక్రమ్ ఈసారి తన మాటలతో సినిమాను నిలబెట్టిస్తాడో లేదో చూద్దాం. సినిమా విడుదల తరువాత మరో పాటను యాడ్ చేస్తున్నారని వార్త వచ్చింది. ఈ న్యూస్ లో నిజం ఎంతుందో చూడాలి.

Facebook Comments
Share

This website uses cookies.