What’s next for Kaushal Manda?

కౌశల్ నెక్స్ట్ ఏంటి ?

బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్ అయ్యాక కౌశల్ రేంజ్ మారిపోయింది. పలు సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు కౌశల్ ను పెట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ కౌశల్ మాత్రం విలన్ గా పాత్రలు వస్తే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాక కౌశల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విలన్ పాత్రలు చెయ్యాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

బిగ్ బాస్ టైటిల్ కౌశల్ కు రావడం కొందరికి మింగుడుపడడం లేదు. కౌశల్ ఆర్మీ అనేది కేవలం బూటకమని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ పూర్తి అయ్యింది. కౌశల్ విన్ అయ్యడు. ఇప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా లాభం లేదు. బిగ్ బాస్ ముందు కౌశల్ దర్శక నిర్మాతల దగ్గరకు వెళ్లి అవకాశాలు అడిగేవారు. కానీ ఇప్పుడు కౌశల్ దగ్గరికి అవకాశాలు వస్తున్నాయి. కౌశల్ మంచి సినిమాలు చేస్తూ కెరీర్ ను బాగా బిల్డ్ చేసుకుంటాడేమో చూద్దాం.

Facebook Comments

About uma

Share

This website uses cookies.