Chiru’s next movie rumors are just rumors

చిరంజీవి సినిమా వార్తలో నిజం లేదు !

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అవ్వలేదు. అక్టోబర్ నుండి కాస్టింగ్ మొదలుపెట్టబోతున్నారు. నవంబర్ లో డిసైడ్ అవుతుంది హీరోయిన్ ఎవరు అనేది. కావున చిరు సినిమాలో తమన్నా నటిస్తోందన్న వార్తలు నమ్మొద్దని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం చిరంజీవి సైరా చిత్రం పై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి కొరటాల శివ సినిమా స్టార్ట్ చెయ్యాలని చిరు భావిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో చరణ్ ఏ సినిమాను నిర్మించబోతున్నారు. చిరు నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు చరణ్ నిర్మాత. కొరటాల శివ సినిమా కూడా చరణ్ నిర్మిస్తున్నాడు. బయటి నిర్మాతలకు చిరు సినిమా ఎందుకు ఇవ్వడం లేదో ఎవ్వరికి తెలీదు. బయటి నిర్మాతలు చిరుతో సినిమా చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నారు. మరి వేరే నిర్మాతలకు చిరు ఎప్పుడు డేట్స్ ఇస్తాడో చూడాలి.

Facebook Comments

About uma

Share

This website uses cookies.