Aravindha Sametha team planning a surprise for fans

అభిమానులకు అరవింద సమేత సర్ప్రైజ్ !

ఎన్‌టి‌ఆర్ నటించిన అరవింద సామెత సినిమా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా విడుదల తరువాత ఒక వారం గ్యాప్ ఇచ్చి రొమాంటిక్ సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ ఫారిన్ లో జానీ మాస్టర్ నేతృత్వంలో జరుగుతోంది. అక్టోబర్ మొదటివారంలో హైదారాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. చిత్రా యూనిట్ మొత్తం ఈ వేడుకలో పాల్గొనబోతోంది.

పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. అభిమానుల అంచనాలు తగ్గకుండా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది. రాయలసీమ నేపద్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సీడెడ్ ఏరియాలో భారీ రేటుకు హక్కులు అమ్ముడు అయ్యాయి. ఎన్‌టి‌ఆర్ ఈ సినిమా కోసం స్పెషల్ డైట్ ఫాలో అయ్యాడు. స్క్రీన్ మీద ఎన్‌టి‌ఆర్ చేసే ఫైట్స్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయని ఇన్సైడ్ టాక్.

Facebook Comments
Share
More

This website uses cookies.