South Cinema

Amar Akbar Anthony is a revenge drama!!!

అమర్ అక్బర్ అంథోని ఒక రివేంజ్ కథ !

Amar Akbar Anthony is a revenge drama!!!

టచ్ చేసి చూడు, నేల టికెట్ సినిమాల తరువాత ప్ర‌స్తుతం రవితేజ శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ అంటోని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ర‌వితేజ‌,ఇటు శ్రీనువైట్ల ఇద్ద‌రు ప్లాప్‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు కావున ఈ సినిమా సక్సెస్ ఇద్దరికి కీలకం. రవితేజ కథానాయకుడిగా మూడు విభిన్న పాత్రలతో తెర‌కెక్కుతుంది అమర్ అక్బర్ అంథోని.

 

రవితేజ ఈ చిత్రలో మూడు విభిన్న పాత్రల్లో నటించడం నిజమే కానీ మనిషి ఒక్కడే అని తెలుస్తోంది. సందర్భాన్ని బట్టి ఒక్కడు ముగ్గురిలా మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్. హీరోకు చిన్నప్పుడు జరిగిన ఒక అన్యాయాన్ని పెద్దైన తరువాత ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనేది మెయిన్ లైన్ గా తెలుస్తోంది. రొటీన్ కాన్సెప్ట్ అయినా టెక్నీకల్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోందని అంటున్నారు.

Facebook Comments
Share