Social News XYZ     

Sye Raa team’s new surprise for Chiru fans?

చిరు అభిమానులకు సర్ప్రైజ్ !

Sye Raa team's new surprise for Chiru fans?

చిరంజీవి నటించిన సైరా సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్ ను త్వరలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ పోస్టర్ లో యంగ్ లుక్ లో చిరంజీవి దర్శనం ఇవ్వబోతున్నదని అంటున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

మెగా డాటర్ ఈ మూవీలో కూచిపూడి డాన్సర్ గా కనిపించనుందని టాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన నరసింహారెడ్డి జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా అలరించబోతోందని రామ్ చరణ్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

Facebook Comments
Sye Raa team's new surprise for Chiru fans?

About uma

%d bloggers like this: