Nagarjuna to romance Anushka again!!

నాగార్జున మరోసారి అనుష్కతో !

సూపర్ సినిమాతో అనుష్క తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నాగార్జుననే ఆమెను తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రోడ్యూస్ చెయ్యడం జరిగింది. ఆ సినిమా తరువాత వీరిద్దరూ కలసి కొన్ని సినిమాల్లో నటించారు. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న బంగార్రాజు సినిమాలో అనుష్క నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దసరా పండక్కి ప్రారంభం కానున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో మూవీని అధికరికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

బాగుమతి సినిమా తరువాత అనుష్క నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. హేమంత్ మదుకర్ డైరెక్షన్ లో అనుష్క ఒక లేడి ఓరియంటెడ్ సినిమా చెయ్యడానికి అంగీకరించింది. ఈ సినిమాతో పాటు నాగార్జున బంగార్రాజు సినిమా ఒప్పుకందని సమాచారం. నాగార్జున డాన్ పాత్రలో నటించిన దేవదాస్ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగనుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఏ సినిమాతో నాగార్జున హిట్ కొడతాడేమో చూడాలి.

Facebook Comments
Share
More

This website uses cookies.