South Cinema

Nani hikes his remuneration!!

నాని రెమ్యునరేషన్ పెంచాడు !

Nani hikes his remuneration!!

ప్రస్తుతం నాని బిగ్ బాస్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవదాస్ సినిమా పూర్తి చేశాడు. అక్టోబర్ నుండి జెర్సీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కోసం నాని 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

 

నాని సినిమా అంటే మినిమం ఓపెనింగ్స్ వస్తాయి. ఎమ్.సి.ఏ సినిమాలో కంటెంట్ పెద్దగా లేకపోయినా ఓవర్సీస్ లో ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది. కావున నిర్మాతలు నాని అడిగిన అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జెర్సీ సినిమా తరువాత నాని మరో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. వాటి వివరాలు త్వరలో నాని ప్రకటించబోతున్నాడు. బిగ్ బాస్ షో కోసం నాని 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొదట్లో బిగ్ బాస్ కు కొంత వ్యతిరేకత వచ్చినా తరువాత నాని హోస్టింగ్ కు మంచి పేరు వచ్చింది.

Facebook Comments
Share