South Cinema

Nagarjuna playing a safe game!

నాగార్జున సేఫ్ గేమ్ ఆడుతున్నాడు !

Nagarjuna playing a safe game!

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా దేవదాస్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాతో నాగ్ హిట్ కొడతాడని నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత నాగార్జున చేయబోతున్న సినిమాలు రెండు.

 

అందులో మొదటిది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీతో పాటు చిలాసౌ సినిమాతో మంచి విజయం సాధించిన నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.

దీన్నిబట్టి చూస్తుంటే నాగార్జున బాక్ టు బ్యాక్ సీక్వెల్స్ చేస్తున్నాడు. రెండు సినిమాలను నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. అంటే కొత్త కథలను నమ్మడం కంటే సీక్వెల్స్ చేస్తే బెటరని భవిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

Facebook Comments
Share