Tamannaah Bhatia demands one crore for a song!

తమన్నా కోటి రూపాయలు అడిగిందా !

Mumbai: Actress Tamannaah Bhatia during a promotional programme in Mumbai on Sept 16, 2018. (Photo: IANS)

అక్కినేని నాగ‌చైత‌న్య డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. చైత‌న్య స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ నటించిన ఈ సినిమాలో మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ను నాగ‌చైత‌న్య‌, త‌మ‌న్నాలపై చిత్రీక‌రించ‌నున్నారు అని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కానీ తమన్నా ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందని సమాచారం. అందుకోసం తమన్నాతో కాకుండా సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ తో సాంగ్ షూట్ చేస్తున్నారు.

అల్ల‌రి అల్లుడు సినిమాలో నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణల‌పై చిత్రీక‌రించిన నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గాయితు.. అనే సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సాంగ్ పూర్తి అయితే సినిమా మొత్తం కంప్లీట్ అయినట్లే. త్వరలో విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించబోతున్నారు.

Facebook Comments
Share

This website uses cookies.