South Cinema

Allu Arjun in a dilemma

అయోమయంలో అల్లు అర్జున్ !

Allu Arjun in a dilemma

అల్లు అర్జున్ సినిమా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. డీజే, నా పేరు సూర్య సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు బన్నీ. విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నచ్చింది కానీ ఆ సినిమా ఆడియెన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అన్నది బన్నీ ప్రశ్న. కావున ఆ సినిమాను హోల్డ్ లో పెట్టడం జరిగింది.

 

ఏ సినిమా చేస్తే బాగుంటుంది ? ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది ? ఈ ప్రశ్నలు బన్నీని వెంటాడుతున్నాయి. ఈ స్ట్రెస్ తగ్గడానికి ఫ్యామిలీతో ఫారిన్ వెళ్ళాడు. త్వరలో ఇండియా తిరిగి వచ్చాక కొత్త సినిమాపై నిర్ణయం తీసుకోబోతున్నాడు అల్లు అర్జున్. వరుసగా రెండు సినిమాలు ప్లాప్. మరో సినిమా కూడా పోతే బన్నీ మార్కెట్ బాగా డౌన్ అవుతోంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఉదేశంతో బన్నీ ఉన్నట్లు సమాచారం. కొత్త దర్శకుడితో వెళ్తాడా ? విక్రమ్ కుమార్ కథతో వెళ్తాడా క్లారిటీ లేదు.

Facebook Comments
Share