South Cinema

Bigg Boss Telugu team’s latest plan!

బిగ్ బాస్ టీం కొత్త ఆలోచన !

Bigg Boss Telugu team's latest plan!

బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యడం జరిగింది. ఆ షో పెద్ద హిట్ అవ్వడంతో నానితో సెకండ్ సీజన్ స్టార్ చేశారు. ఇప్పుడు సీజన్ 2 ఎండింగ్ కు వచ్చింది. మరో రెండువారాలో ఈ సీజన్ కంప్లీట్ అవుతోంది. బిగ్ బాస్ రెండు సీజన్స్ బాగా జనాల్లోకి వెళ్లడంతో మూడో సీజన్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

 

ఈసారి బిగ్ బాస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కాకుండా లోనవలలో చేయాలనేది వారి ఆలోచన. ఎందుకంటే.. సీజన్ 2 హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో జరిపారు. ఇక్కడ చెయ్యడం వల్ల నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినెట్ అవుతున్నారో ఈజీగా జనాలకు తెలిసిపోతోంది. స్టూడియోలో పనిచేసే వారు, ఆడియన్స్ విషయాలను బయటికి చెబుతున్నారు. కావున ఈసారి సీజన్1 జరిగిన లొకేషన్ లొనే 3వ సీజన్ చెయ్యలనేది బిగ్ బాస్ వారి అభిప్రాయం.

బిగ్ బాస్ సీజన్ 3ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. అయితే విజయ్ దేవరకొండ కానీ, రానా కానీ చేస్తే బాగుంటుందని మాటీవీ వారు వారిద్దరిని సంప్రదించడం జరిగింది. వీరద్దరిలోనే ఒకరు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Facebook Comments
Share