Vijay Deverakonda is not part of Yatra

విజయ్ దేవరకొండపై అసత్య ప్రచారం !

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహిత్ రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం తను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర. అదే ఇతివృత్తంతో యాత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మహిత్ రాఘవ.

ఈ సినిమాలో జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ న్యూస్ లో నిజం లేదని సమాచారం. ఇప్పటివరుకు విజయ్ దేవరకొండను యాత్ర చిత్ర యూనిట్ సంప్రదించలేదని తెలుస్తోంది. జగన్ పాత్రలో సూర్య చేసే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. కానీ జగన్ రోల్ మాత్రం షూట్ జరగలేదు. త్వరలో జగన్ పాత్రకు ఎవరు సెట్ అవుతారో చూసి చిత్ర షూటింగ్ పూర్తి చెయ్యాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

Facebook Comments
Share

This website uses cookies.