Pooja Hegde demands 1 crore !

పూజ హెగ్డే కోటి రూపాయలు అడిగింది !

పూజ హెగ్డే ప్రస్తుతం ఎన్టీఆర్ అతవింద సమేత, మహేష్ బాబు మహర్షి, ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ సినిమాలు చేస్తోంది. చేతిలో ఒక్క హిట్ సినిమా లేకపోయినా ఈ ముద్దుగుమ్మకు వరుస పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ హీరోయిన్ నటించిన గత సినిమాలు ముకుంద, ఒక లైలా కోసం, డీజే, సాక్ష్యం సినిమాలు ఎంత పెద్ద ప్లాప్స్ అన్నది అందరికి తెలిసిందే. అయిన సరే ఎక్సపోజింగ్ విషయంలో ఎక్కడ కంప్రెమేజ్ అవ్వదని ఈ అమ్మడుకు అవకాశాలు భారీగా వస్తున్నాయి. తాజా సమాచారం ఏంటంటే... కళ్యాణ్ రామ్ ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. మజ్ను సినిమా దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీలో నటించనని పూజ హెగ్డే ను ఆడిగట నిర్మాతలు.

అయితే కళ్యాణ్ రామ్ సినిమాలో నటించడానికి పూజ హెగ్డే కోటి రూపాయలు ఆడిగిందని సమాచారం. పెద్ద హీరోల సినిమాలు చేస్తున్న కారణంగా ఏకంగా కోటి రూపాయలు అడగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంత భారీ అమౌంట్ ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిగా లేరు. కావున వేరే హీరోయిన్ ను లాక్ చేద్దామని నిర్మాతలు చూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమము త్వరలో ప్రారంభించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పూజ స్థానంలో మెహరిన్ ను తీసుకుందామని యూనిట్ అనుకుంటుంది. ప్లాప్స్ లో ఉన్న హీరోయిన్ ఇంత భారీ రెమ్యూనరేషన్ అడగడం నిజంగా విడ్డురంగ ఉంది.

Facebook Comments
Share

This website uses cookies.