South Cinema

Deerga Ayushman Bhava movie first look poster released

"దీర్ఘఆయుష్మాన్ భవ" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Deerga Ayushman Bhava movie first look poster released

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం "దీర్ఘఆయుష్మాన్ భవ". డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా

 

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - '' చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, ఆమని, పృథ్వీరాజ్‌, జెమినిసురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

Facebook Comments

About uma

Share