Pawanism 2 Motion Poster Launched by VV Vinayak

వి వి వినాయక్ చేతుల మీదుగా పవనిజం 2 మోషన్ పోస్టర్ విడుదల

ఆర్ కె స్టూడియోస్ పతాకం పై గుంటూరు టాకీస్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన నిర్మాత రాజశ్రీ ఇప్పుడు పవనిజం 2 సినిమా ని నిర్మిస్తున్నారు. మధు బాబు, పావని హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమాని  కృష్ణ చైతన్య దర్శకుడు. సమాజం లో ఎవరికీ సరైన బాధ్యత ఉండట్లేదు. అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన ప్రేరణతో సొసైటీ ని మార్చే భాద్యత తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి పాలిటిక్స్ లో ప్రజల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చాడనేదే ఈ చిత్రం కథాశం.

అయితే అక్టోబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పవనిజం 2 కు సంబంధించిన  మొదటి మోషన్ పోస్టర్ ను అగ్ర దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా  విడుదల చేసారు. ఈ సందర్భంగా...

వి వి వినాయక్ మాట్లాడుతూ "ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయన మీద అభిమానం తో అయన ఉదేశాలని అయన సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని పవనిజం 2 సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అని పవన్ కళ్యాణ్ గారికి నచ్చే సినిమా కావాలి అని కోరుకుంటున్నాను. దర్శకుడు కృష్ణ చైతన్య కి మంచి పేరు రావాలని నిర్మాత రాజశ్రీ గారికి మంచి డబ్బు రవళి అని కోరుకుంటున్నాను" అని తెలియజేసారు.

నిర్మాత రాజశ్రీ మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా సినిమా పవనిజం 2 మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన వి వి వినాయక్ గారికి నా కృతఙ్ఞతలు. వారు మా సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా సంతోషం. మా సినిమా కథ చాలా బాగా వచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమా ని బాగా చిత్రీకరించారు. సినిమా షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని డిసెంబర్ లో విడుదల చేస్తాము" అని తెలిపారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, ఎడిటింగ్ : ఎస్ శేఖర్, కెమెరా : రామ్ పి రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు మరియు దర్శకత్వం : కృష్ణ చైతన్య, నిర్మాత : రాజశ్రీ.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%