South Cinema

Friendship v/s Love movie trailer launched

ప్రేమ గెలుస్తుందా.. స్నేహం నిలుస్తుందా?

Friendship v/s Love movie trailer launched

నైనేష్ ఫిలిమ్స్ పతాకంపై.. ఎల్.వి.రాజ్ శేఖర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మిస్తున్న ముక్కోణ ప్రేమ కథా చిత్రం "ఫ్రెండ్ షిప్ వెర్సస్ లవ్"  సూర్య, మనీష్, స్నేహ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎఫ్.ఎం.బాబాయ్, జబర్దస్త్ అప్పారావు, శిరీష, శ్రీకర్ నీరోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఘంటసాల విశ్వనాధ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్ విడుదల చేశారు.

 

హైద్రాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో శక్తి గ్రూప్ ఎం.డి రాజ శేఖర్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ట్రైలర్ ని జె మీడియా అధినేత సురేష్ లాంచ్ చేశారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త రామ్మోహన్ రాయలు, జె న్యూస్ ఎం.డి జీవన్ గౌడ్, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వైజాగ్ బీచ్ లో భారీ స్థాయిలో పలు రంగాలకు చెందిన పుర ప్రముఖల సమక్షంలో త్వరలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నామని.. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా సమకూర్చిన చిత్ర దర్శకుడు ఎల్.వి.రాజ్ శేఖర్ చెప్పారు.

ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రాణ సంహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధిస్తారు? ప్రేమ గెలుస్తుందా? స్నేహం నిలుస్తుందా? అనే నేపథ్యంలో రూపొందిన 'ఫ్రెండ్ షిప్ వెర్సస్ లవ్' కచ్చితంగా యువతరం ప్రేక్షకులతోపాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం అని నిర్మాత గుండ్రెడ్డి వెంకటేశ్వరెడ్డి అన్నారు!

Facebook Comments

About uma

Share