South Cinema

Sagara Theeramlo movie audio launched

సాగరతీరంలో ఆడియో విడుదల

Sagara Theeramlo movie audio launched

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు వినోద్, నరేంద్ర, హాస్యనటులు అంబటి శ్రీను, నామాల మూర్తి, రంగస్థలం లో నెగటివ్ రోల్ పోషించిన పవన్ సురేష్, యువ నటులు ఉదయ్ పులిమే, సూర్య తేజ సుంకర, సిద్దు రాయవు రెడ్డి ముఖ్య పాత్రలో ధర్మారావు జగతా దర్శకత్వం లో తడాలా వీరభద్రరావు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'సాగరతీరం లో '...

 

సంగీత దర్శకుడు భోలె అందించిన అద్భుతమైన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ రోజు విడుదలైనయి. ఈ అందమైన పాటలు సక్సెస్స్ ఫుల్ నిర్మాత మల్కాపురం, రేలంగి నరసింహ రావు విడుదల చేసారు.

పాటలు విని రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ 'పాటలు చాలా బాగున్నాయి, సంగీత దర్శకుడు భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. దర్శకుడు ధర్మారావు EEV సత్యనారాయణ దగ్గర పని చేసాడు. టాలెంట్ ఉన్న దర్శకుడు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ సాగరతీరంలో సినిమా మంచి విజయం కావాలి' అని కోరుకున్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ 'టైటిల్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, చిన్న సినిమా ని అందరూ ప్రోత్సహించాలి. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న' అని తెలిపారు.

కోనసీమ పరిసర ప్రాంతాలైన అమలాపురం, ముమ్మిడివరం, పాండిచ్చేరి యనంతో పాటు ఎన్ రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీరప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం అని చిత్ర ుునిట్ తెలియజేసారు.

Facebook Comments

About uma

Share