South Cinema

Nara Rohit Birthday celebrations held at Vijayawada

 విజయవాడలో ఘనంగా నారా రోహిత్   జన్మదిన వేడుకలు           

Nara Rohit Birthday celebrations held at Vijayawada

విజయవాడలో ఘనంగా నారా రోహిత్   జన్మదిన వేడుకలను అభిమానులు జరుపుకున్నారు   ఏపీ సీఎం నారా .చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర ఉన్న తాడేపల్లి లో చిగురు చిల్డ్రన్ హోమ్ వద్ద నారా .రోహిత్ జన్మదినం సందర్భంగా నారా .రోహిత్ అభిమాన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వీరపనేని .శివ అధ్వర్యంలో అనాధ పిల్లలకు పండ్లు, పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణి చేయడం జరిగింది .మధ్యాహ్నం అనాధపిల్లలకు అన్నదానం చేయడం జరిగింది .
వీరపనేని .శివ మాట్లాడుతూ ... నా ఆధ్వర్యంలో నారా .రోహిత్ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం  నిర్వహించడం జరుగుతుంది .సేవ కార్యక్రమాలు చేయడంలో నారా .రోహిత్ అభిమానులు ముందుంటారు అని వీరపనేని .శివ పేర్కొన్నారు .

 

ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త అట్లూరి నారాయణరావు , తాటికొండ సాయి కృష్ణ పాల్గొన్నారు .

ప్రముఖ పారిశ్రామిక వేత్త అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ ... అభిమానుల సమక్షంలో జరుగుతున్న నారా .రోహిత్ గారి జన్మదిన వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు .మరియు నారా .రోహిత్ గారి తదుపరి చిత్రం తాను నిర్మించడం చాలా  గర్వంగా ఉంది అని పేర్కొన్నారు ...

తాటికొండ సాయి కృష్ణ మాట్లాడుతూ... రెండు తెలుగురాష్ట్రాలలో అభిమాననాయకుల  సమక్షంలో నారా .రోహిత్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అని అన్నారు ..

ఈ కార్యక్రమంలో నారా రోహిత్  అభిమానులు మరియు అభిమాన సంఘ నాయకులు  పాల్గొన్నారు .

Facebook Comments

About uma

Share