Desam Lo Dongalu Paddaru movie getting ready for censor

సెన్సార్ కార్యక్రమాల్లో "దేశంలో దొంగలు పడ్డారు"

Desam Lo Dongalu Paddaru movie getting ready for censor

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందుతున్న చిత్రం "దేశంలో దొంగ‌లు ప‌డ్డారు". ఈ చిత్రాన్ని సారా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ర‌మా గౌతమ్ నిర్మిస్తున్నారు. గౌత‌మ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రమా గౌతమ్ మాట్లాడుతూ... "తాము చిత్రీకరణ జరిపిన లొకేషన్ లు తమ కథకు, కథనానికి మరింత బలాన్ని చేకూర్చాయి. కెమెరామేన్ శేఖర్ గంగనమోని తన పనితనంతో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణను తీసుకోచ్చాడు. రీసెంట్ గా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన మా మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఒక చిన్న చిత్రానికి ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్పందన రావడం అనేది చాలా అరుదు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న మా చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శేఖ‌ర్ గంగ‌న‌మోని , సంగీతం: శాండీ, ఎడిటింగ్: మ‌ధు. జి. రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, లైన్ ప్రొడ్యూస‌ర్: సాయికుమార్ పాల‌కూరి, స‌హ నిర్మాత‌: స‌ంతోష్ డొంకాడ‌.

Facebook Comments

About uma

Share