South Cinema

Sony Charishta Feels Lucky to Share Screen With Arjun & Raadhika Kumara Swamy

కాంట్రాక్ట్ లో సోనీ చరిష్ట

Sony Charishta Feels Lucky to Share Screen With Arjun & Raadhika Kumara Swamy

అర్జున్ సర్జా (యాక్షన్ కింగ్ అర్జున్), జె.డి చక్రవర్తి, రాధికా కుమార్ స్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య), సోనీ చరిష్ట ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ' కాంట్రాక్ట్ '. సంజయ్ సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై.. గోదావత్ సమర్పణలో రంజిత్ గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం పట్ల యువ కథానాయకి సోనీ చరిష్ట సంతోషం వ్యక్తం చేస్తోంది.

 

ఆమె మాట్లాడుతూ.. ''అర్జున్, జె.డి చక్రవర్తి వంటి వారితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. 'కాంట్రాక్ట్' సినిమా నా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సతీమణి రాధికా కుమార స్వామితో కలిసి నటించడం నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. ఒక ముఖ్యమంత్రికి భార్య అయ్యుండి కూడా ఆమె పాటించే సింప్లిసిటీకి నేను ఫిదా అయిపోయాను ప్రస్తుతం తమిళంలో ఒకటి, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను* అని చెప్పింది!!

Facebook Comments

About uma

Share