South Cinema

Sudi Gali movie shoot completed

Sudi Gali movie shoot completed

చెట్టుపల్లి లక్ష్మీ సమర్పణలో శివ పార్వతి క్రియేషన్స్ పతాకంపై వెంకటేష్ గౌడ్ ప్రాచీ అధికారి , మల్లేష్ బి అభయ్ కులకర్ణి మమత హీరో హీరోయిన్ లు గా రమేష్ అంకం దర్శకుడు గా చెట్టుపల్లి వెంకటేష్ ,బిరాదర్ మల్లేష్ నిర్మాతలుగా రూపొందుతున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం సుడిగాలి .

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది .

 

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ...ఈ చిత్రంలో ఐదు పాటలు,ఐదు ఫైట్లు ఉన్నాయి రాప్ రాక్ షకీల్ మంచి మ్యూజిక్ తో పాటు రేరికార్డింగ్ అద్భుతంగా అందించారు. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అద్భుత మైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తిచేసాం .ఈ చిత్రం లో సుమన్ గారు అద్భుత మైన లీడ్ రోల్ పోషించారు.ప్రస్తుతము పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మా చిత్రం త్వరలోనే పూర్తి చేసుకుని జులై లో ఆడియో ను ఆగస్టు లో సినిమా ను విడుదల చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము .ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము .

దర్శకుడు మాట్లాడుతూ ...హీరో హీరొయిన్ లు కొత్తవారుఅయిన అద్భుతంగా నటించారు .అనుకున్న సమయములో నే సినిమా నూ పూర్తి చేసి రిలీస్ చేయడానికి నిర్మాతలు పూర్తి సహకారాము అందిస్తున్నారు .ఈ చిత్రం ద్వారా నాకు మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.

ఇంకా ఈ చిత్రములో సుమన్,గౌతమ్ రాజ్,సుమన్ శెట్టి, చిట్టిబాబు,నరసింహ,సుహాశిని,వర్మ,కృష్ణ,తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
పాటలు: శ్రీను సాగర్.ఎం.భాష శ్రీ,దాట్లవెంకన్న
కెమెరా: విద్య సాగర్
ఎడిటింగ్: వినయ్ రామ్
మ్యూజిక్:రాప్ రాక్ షకీల్
ఫైట్స్:రియల్ సతీష్
నిర్మాతలు : చెట్టుపల్లి వెంకటేష్ , బిరాదర్ మల్లేష్
సమర్పణ:చెట్టుపల్లి లక్మి
కథ ,మాటలు దర్శకత్వం : రమేష్ అంకం.

Facebook Comments

About uma

Share