Maa Health Camp Held On June 10th #Gallery

(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హెల్త్ క్యాంప్ ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు రెండో ఆదివారం మా ఆధ్వర్యంలో గ్లోబల్ హాస్పిటల్ వారు హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా ECG, 2D ECO, RBS, BP, Height, Weight మొదలయిన పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ నిపుణులైన డా.కిరణ్ గారు మరియు జనరల్ ఫిజిషియన్ డా.సతీష్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ’మా‘ సభ్యులందరూ ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ వి.కె.నరేష్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హెల్త్ కమిటీ చైర్మన్ నాగినీడు గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%