South Cinema

Ammammagarillu Still Going Strong In Its 3rd Week

మూడో వారం లో కూడా ముందంజ లో వున్న అమ్మమ్మ గారిల్లు కలెక్షన్స్

నాగ సౌర్య హీరో గా సుందర్ సూర్య దర్శకత్వం లో స్వాజిత్ మూవీస్ పతాకం పై కె ఆర్ సహా నిర్మాత గా రాజేష్ నిర్మించిన ' అమ్మమ్మ గారిల్లు'. విడుదల అయ్యి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారం లోకి అడుగు పెట్టుకొంది .ఇప్పటికి మంచి కలెక్షన్స్ తో ప్రదర్సితమవుతుందని చిత్ర దర్శకులు సుందర్ సూర్య చెబుతూ...దర్శకుడిగా నా మొదటి చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు ముందు గా నా కృతజ్నతలు .మంచి సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారని మరో సారి రుజువు చేసిన చిత్రం మా "అమ్మమ్మ గారిల్లు" అని అన్నారు.నిర్మాతలు రాజేష్, కె ఆర్ మాట్లాడుతూ ఈ కథ మీద వున్న నమ్మకం తో ఈ సినిమా ప్రారంభించాం .మా అంచనాలకు మించి పెద్ద విజయాన్ని ప్రేక్షక దేవుళ్ళు అందించినందుకు చాలా సంతోషం గా వుంది.మాకు సహకరించిన ప్రతీ నటి నటులు కు అందరికీ థాంక్స్..మూడో వారం లో మరికొన్ని థియేటర్స్ పెంచుతున్నాం .నిర్మాతలుగా మాకు మా స్వాజిత్ మూవీస్ సంస్థ కు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం మా "అమ్మమ్మ గారిల్లు" అని అన్నారు.

 

Facebook Comments

About uma

Share