Director Y. V. S. Chowdary is a talent exploring celluloid scientist

కొత్త హీరో హీరోయిన్లను కనిపెట్టే సెల్యులాయిడ్ సైన్స్సిస్ట్ వై వి యస్ చౌదరి

యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి స్క్రీన్ నేమ్ వై వి యస్ చౌదరి, మే 23 న పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్  సింహావలోకనం చేసుకుంటే... విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు  నందమూరి తారక రామరావు వీర అభిమాని అయినా అతను ఆ మహానటుడి తేజోరూపం పట్ల  ఆకర్షితుడై తెలుగు సినీ రంగం లోకి ప్రవేశించి ఓ గొప్ప  దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా, పంపిణీదారుడిగా మరియు ప్రదర్శన దారుడిగా ఈనాడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నిలపెట్టుకున్నాడు వై వి యస్ చౌదరి. తన అభిమాన నటుడు యన్టీర్ ను మాస్ హీరోగా ఎలివేట్ చేసిన కె.రాఘవేంద్ర రావు వద్ద  శిష్యరికం చేసాడు.

తన గురువు లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు, వై వి యస్ చౌదరి పుట్టిన తేదీ మే 23 ఒకే రోజు కావటం ఒక విశేషమైతే, పాటల చిత్రీకరణ లో, హీరోయిన్లను గ్లామర్ గా  చూపించడం లో ఇద్దరికి సామీప్యత ఉండడం గమనార్హం. ఇంకా రామ్ గోపాల్ వర్మ, హిందీ దర్శకుడు మహేష్ బట్ మరియు కృష్ణ వంశీ ల వంటి దర్శకుల తో  పనిచేసిన  అనుభవంతో, 1998 లో  అక్కినేని నాగార్జున నిర్మాతగా,  మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు,  కొత్త నటీనటులతో 'సీతా రాముల కళ్యాణం చూతము రారండి'  చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఇదే బ్యానర్ లో ఎన్నో సంవత్సరాలుగా నటనకు దూరంగా వున్నా నందమూరి హరి కృష్ణ కు మళ్ళి మేకప్ వేసి అక్కినేని నాగార్జున కు అన్నగా నటింపచేసాడు.

ఆ తరువాత మహేష్ బాబు హీరోగా 'యువరాజు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. 'బొమ్మరిల్లు వారి' అనే  బ్యానర్ స్థాపించి 'లాహిరి లాహిరి లాహిరిలో ..' వంటి కుటుంబకథా చిత్రం, ఈ చిత్రం లో  అంకిత, ఆదిత్య లను  టాలీవుడ్ కి పరిచయం చేసాడు.  'సీతయ్య..ఎవడి మాట వినడు' వంటి మాస్ మసాలా చిత్రం, మరో సారి మరో  కొత్త హీరో హీరోయిన్ రామ్, ఇలియానాలను టాలీవుడ్ కి అందించాడు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో  ఏ రేంజ్ కి వెళ్ళారన్నది మనం చూస్తున్నాం.

బొమ్మరిల్లు వారి బ్యానర్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన చౌదరి నందమూరి బాలకృష్ణ హీరో గా 'ఒక్క మగాడు'  స్వీయ దర్శకత్వం లో అందించాడు. మంచు విష్ణు తో 'సలీం' చిత్రం తరువాత మళ్ళి బొమ్మరిల్లు వారి బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసి 'రేయ్' చిత్రం తో మరో మాస్ హీరో ను టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ప్రస్తుతం మళ్ళీ కొత్త నటీనటులతో సరికొత్త సబ్జెక్టు రెడీ చేస్తున్నారు వై వి యస్ చౌదరి.

ఆనాడు తెలుగు సినిమాకు కొత్త నటులను పరిచయం చేసి టాలీవుడ్ లో గొప్ప నటీనటులుగా నిలబెట్టిన ఘనత స్వర్గీయ  దాసరి నారాయణ రావు చెందుతుంది.  తరువాత ఆ స్థానం లో వై వి యస్ కి చెందుతుంది అనడంలో సందేహం లేదు.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.