Bangari Balaraju movie songs launched by Dil Raju & Bhuma Akhila Priya

నిర్మాత దిల్ రాజు, మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా "బంగారి బాలరాజు" పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రం లోని మరోపాట ‘నా కొంగులో నా గుండెలో....’ అంటూ సాగే  సాంగ్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు గారు మాట్లాడుతూ... కొత్తవారితో తెరకెక్కిన బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా మంచి విజయం సాధించాలని హీరో, దర్శక నిర్మాతలకు విషెస్ అందించారు.

ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ... అంతా కొత్తవారితో చక్కని ప్రేమకధా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రజలందరికి బాగా నచ్చుతుందని, దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ చిత్రంలోని ఈ చక్కటి పాటను నా చేతుల మీదుగా రిలీజ్ కావడం అనందంగా ఉందని తెలిపారు.

హీరో రాఘవ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మా చిన్నసినిమాకి పెద్దమనసు తో బంగారి బాలరాజు సినిమాలోని నా కొంగులో నా గుండెలో అనే పాటను విడుదల చేసి మా టీం కు బ్లెస్సింగ్స్ అందించండం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్బంగా దిల్ రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ... “బంగారి బాలరాజు సినిమా లోని మంచి ఫీల్ తో సాగే ఈ పాటను దిల్ రాజు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది.  ‘అలాగే ఈ చిత్రంలోని ‘ఏమి కళ్లురో మామ’… అనే పాటను మా వెల్ విషర్, టిడిపి నాయకులు బిజ్జం పార్ధసారధి రెడ్డి అన్నగారు, మరియు  ‘చెలియా నీ కోసం’…. అంటూ సాగే పాటను ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖా మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది. అతిరధమహారధులు మా చిత్రంలోని పాటలను విడుదల చేసి వారి ఆశీస్సులను అందించడం మా చిత్ర యూనిట్ కు మరెంతో ఉత్సాహాన్ని కలిగించింది. మా తరుపున, మా యూనిట్ తరుపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... దిల్ రాజుగారు, బిజ్జం పార్దసారధి రెడ్డి గారు, భూమా అఖిలప్రియ గారు మా బంగారి బాలరాజు చిత్రంలోని పాటలను విడుదల చేయడం ఆనందంగా ఉందంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.

టెక్నిషియన్స్

కెమెరా : చక్రవర్తి

ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ

ఎడిటింగ్ : నందమూరి హరి

సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు

పాటలు : చిలకరెక్క గణేష్

ఫైట్స్ : రామ్ సుంకర

పి.అర్.ఓ : కడలి రాంబాబు. KNS (కడలి మీడియా)

నిర్మాతలు : కె.యండి. రఫీ, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :

కోటేంద్ర దుద్యాల

​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

Facebook Comments

About uma

Share

This website uses cookies.