Social News XYZ     

Cinematographer Kabir Lal Will Direct The Remake Of The Spanish Movie Julia’s Eyes

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్ ద‌ర్శ‌క‌త్వం లో స్పానిష్ మూవీ "జూలియాస్ ఐస్" రీమేక్‌

న‌రుడా ఓ న‌రుడా ఏమి కోరిక అంటూ అల‌నాటి అందాల ముద్దుగుమ్మ రంభ, నంద‌మూరి బాల‌కృష్ణ తో ఆడిపాడిన పాట తెలుగు సినిమా వున్నంత‌కాలం గుర్తుండిపోయేలా చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.. అంతేకాదు ఏ విధ‌మైన టెక్నాలాజి లేన‌ప్పుడు మ‌రుగుజ్జులుగా చూపించిన ఘ‌న‌త ఆ చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ క‌బీర్ లాల్ కే చెందుతుంది. నట‌సింహం బాల‌కృష్ణ కెరీర్ లో మెద‌టి స్టానంలో బైర‌వ‌ద్వీపం వుంటుంది. అలాగే ప్రెజెంట్‌, ఫాస్ట్‌, ఫ్య‌చ‌ర్ టైమ్స్ కి ఓ మిష‌న్ ద్వారా ఆరోజుల్లోనే ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్ళిన చిత్రం ఆదిత్యా 369. ఈ చిత్రానికే కాకుండా తెల‌గులో అనేక చిత్రాల‌కి మెగాస్టార్ చిరంజీవి న‌టించిన అంద‌రివాడు, లారెన్స్ హీరోగా చేసిన స్టైల్ చిత్రాల‌తో పాటు దాదాపు తెలుగులో 25 చిత్రాలకి త‌న కెమెరా పనిత‌నాన్ని చూపించారు. కేవ‌లం తెలుగులోనే కాదు బాలీవుడ్ లో ఇప్ప‌టికి ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించిన చిత్రాల్లో క్లాసిక్ గా నిల‌బ‌డిని చిత్రం తాళ్, మ‌రియు ప‌ర‌దేశ్ చిత్రాల‌కు ఫిలింఫేర్ అవార్డుల్ని గెలుచుకున్నారు. అప్నే యువ‌రాజ్‌, వెల్‌క‌మ్ బ్యాక్ లాంటి చిత్రాలకి కూడా ఆయ‌న పనిచేశారు.. చేసిన ప్ర‌తిచిత్రం అద్బుత‌మైన విజువ‌ల్స్ తో 10 సంవ‌త్స‌రాలు ముందుగా టెక్నాల‌జి ఊహించి చూపించిన‌ ఇండియన్ ఓన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ క‌బీర్ లాల్‌..

స్పానిష్ లో 20 మినియ‌న్స్ క‌లెక్ష‌న్స్ తో క్రిటిక్స్ ని సైతం ఆశ్య‌ర్య‌ప‌రిచిన జూలియాస్ ఐస్ చిత్రానికి సంభందించిన ఆల్ ఇండియా రైట్స్ ని క‌బీర్‌లాల్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్నియు.ఎస్‌కు చెందిన యంగ్ అండ్ ఫ్రీ ఫిలింస్ ఎల్ఎల్‌సి, ఇండియాకు చెందిన మూవీ మేజిక్‌, ప్ల‌స్ ఎక్యుప్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా తెలుగు, త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. క‌థ విష‌యానికోస్తే త‌న క‌వ‌ల సోద‌రిని చంపిన దుండ‌గుల‌ను క‌నుగొనే ఓ అమ్మాయి క‌థే ఈ సినిమా. మిస్ట‌రీని చేదిస్తున్న క్ర‌మంలో ఆమె త‌న కంటి చూపును క్ర‌మంగా కోల్పోతూ ఉంటుంది. యూర‌ప్‌లో విడుద‌లైన ఈ చిత్రం హ్యూజ్ హిట్ అయ్యింది. గ్యుల్లేర్మో డేల్ టోరో స‌మ‌ర్ప‌ణ‌లో యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై నిర్మిత‌మైన ఈ థ్రిల్ల‌ర్ రొటేన్ టోమాటోస్‌లో 91 శాతం రేటింగ్‌ను పొందింది. ఈ సినిమాను కన్న‌డం, మ‌రాఠీ, మల‌యాళ భాషల్లో కూడా రీమేక్ చేయ‌బోతున్నారు.

 

ప్ర‌ముఖ కెమెరామెన్ క‌బీర్‌లాల్ మాట్లాడుతూ.. స్పానిష్ లో సూప‌ర్‌బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన జూలియ‌స్ ఐస్ చిత్రాన్ని ఇండియా వైడ్ రీమెక్ రైట్స్ తీసుకున్నాము. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. తెల‌గు, త‌మిళ భాష‌ల్లో నిర్మిస్తున్నాము. ఇది పూర్తిగా వుమెన్ ఒరియంటెడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కావ‌టం తో ఈ పాత్ర‌కు స‌రితూగే హీరోయిన్స్ కోసం చూస్తున్నాము. సౌత్ లో లేడి సూప‌ర్‌స్టార్ వున్నారు క‌నుక వారిని సంప్ర‌దిస్తాము. ఈ చిత్రం టెక్నిక‌ల్ గా హ‌లీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం తీసుపోకుండా వుంటుంద‌నేది సందేహం లేదు. 2019 లోనే ఈ చిత్రనిర్మాణాన్ని ప్రారంభించి విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. త్వ‌ర‌లో ఈ చిత్రం లో చేయ‌బోయ్ హీరోయిన్ ని ఎనౌన్స్ చేస్తాము. అతి త్వ‌ర‌లో మిగ‌తా వివ‌రాలు తెలియ‌జేస్తాము.. అని అన్నారు

Facebook Comments
Cinematographer Kabir Lal Will Direct The Remake Of The Spanish Movie Julia's Eyes

About uma

%d bloggers like this: