South Cinema

Arun Vijay’s Crime 23 movie to release on May 18th

ఈ నెల 18న వ‌స్తోన్న   మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  ‘క్రైమ్‌ 23’!!

Arun Vijay's Crime 23 movie to release on May 18th

‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవ తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణ. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి  చేసుకుని ఈ నెల 18న విడుద‌లకు సిద్ద‌మైంది.

 

ఈ సంద‌ర్భంగా  నిర్మాత ప్ర‌సాద్ ధ‌ర్మిరెడ్డి మాట్లాడుతూ....‘‘తమిళనాడులో జరిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్  క్రైమ్ 23.  అక్క‌డ  భారీ వసూళ్లు రాబట్టుకొని విమర్శకుల‌ ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ఆల్ ఎమోష‌న్స్ తో ద‌ర్శ‌కుడు అరివ‌ళ‌గ‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు.  అరుణ్‌ విజయ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇందులో  మంచి మెసేజ్‌ తో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్‌ హంగుల‌న్నీ ఉన్నాయి. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం.  విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌, భాస్కరన్‌ స్టైలిష్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇటీవ‌ల ప్ర‌భాస్ గారి చేతుల మీదుగా విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసాం. ఈ నెల 18న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీల‌కపాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌;సినిమాటోగ్రఫీ: కె.యమ్‌ భాస్కరన్‌; నిర్మాతలు:  ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు,  సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌; దర్శకత్వం: అరివళగన్‌.

Facebook Comments

About uma

Share