Sagara Theramlo Movie Starts Post Production Work

పోస్ట్ ప్రొడక్షన్ దశలో సాగరతీరంలో

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు వినోద్, నరేంద్ర, హాస్యనటులు అంబటి శ్రీను, నామాల మూర్తి, రంగస్థలం లో నెగటివ్ రోల్ పోషించిన పవన్ సురేష్, యువ నటులు ఉదయ్ పులిమే, సూర్య తేజ సుంకర, సిద్దు రాయవు రెడ్డి ముఖ్య పాత్రలో ధర్మారావు జగతా దర్శకత్వం లో తాడాల వీరభద్రరావు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'సాగరతీరంలో '...

కోనసీమ పరిసర ప్రాంతాలైన అమలాపురం, ముమ్మిడివరం, పాండిచ్చేరి యానంతో పాటు ఎన్ రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీరప్రాంతాల్లో ప్రధాన తారాగణం పాల్గునగా సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత వీరభద్రరావు మాట్లాడుతూ "మా సాగరతీరంలో యువతరానికి కనెక్ట్ అయ్యే అందమైన ప్రేమకథ, నవ్వులు పంచే కామెడి, భయపెటే హార్రర్, థ్రిల్ కు గురిచేసే సస్పెన్స్ తో పాటు దేశభక్తి నిమితమైన క్లీన్ ఎంటర్టైనర్" అని తెలిపారు.

దర్శకులు ధర్మారావు మాట్లాడుతూ "ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ముస్తాబు చేస్తున్నామని, ఎడిటింగ్ పూర్తిచేసుకుని డబ్బింగ్ తుది దశలో ఉంది. మిగిలిన వర్క్ కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తాం" అని తెలిపారు.

మా సినిమా త్వరగా పూర్తికావడానికి సహకరించిన యూనిట్ సభ్యులందరికి ప్రత్యేక కృతఙ్ఞతలు అని సహనిర్మాతలు శశికళ, రామలింగప్రసాద్ అన్నారు.

కథ రచయిత శ్రీనివాస్ జగతా మాట్లాడుతూ "మా మైండ్ లో వున్న విజువల్స్ ని ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత మా కెమెరా మాన్ కిషన్ సాగర్ ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సంగీత దర్శకుడు భోలే అద్భుతమైన ఆరు పాటలు అందించారు. సినిమా విజయం లో సంగీతం ముఖ్య పాత్ర పోషించుతుంది" అని అన్నారు.

బొమ్మిరెడ్డి ప్రసాదు, గుర్రం రామకృష్ణారావు బెన్నీ, గనిశెట్టి స్కందన్ , భలే చాన్సులే శ్వేతా, చైతన్య మోటూరి, అమర్, వీరు, గాడం రాజేష్, శేఖర్ గోకాడ, చారు శ్రీ, భానుమతి, లాస్య తాడాల , బేబీ ఆరాధ్య జగతా తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం : ధర్మారావు జగతా, నిర్మాత : తాడాల వీరభద్రరావు, సహా నిర్మాతలు : తాడాల శశికళ, నార్ని రామలింగప్రసాద్ , కథ, స్క్రీన్ ప్లే, మాటలు, చీఫ్ అసోసియేట్ : జగతా శ్రీనివాస్, కో డైరెక్టర్ : నాని బాబు, డి ఒ పి : కిషన్ సాగర్, సంగీతం : భోలే, ఎడిటింగ్ : శివ శార్వాణి, డాన్స్ : బెన్నీ (ఆట ), ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, ఆర్ట్ డైరెక్టర్ : నారాయణ, కాస్ట్యూమ్స్ : పేర్ని రాంబాబు, మే కప్ చీఫ్ : మామిడిపల్లి శ్రీను, లిరిక్స్ : భోలే, సాయి సిరి, దాట్ల, తాడాల శశికళ , గరుగు శ్రీనివాస్.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.