Social News XYZ     

Mehbooba censored with UA, releasing on May 11th

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి - మే 11 విడుదల 

Mehbooba censored with UA, releasing on May 11th

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'మెహబూబా'. మే 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు... శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

 

ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ ''మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సభ్యులందరికీ సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఆకాష్‌ చాలా బాగున్నాడు, లవ్‌ స్టోరీ చాలా బాగుంది అని పదే పదే చెప్పడంతో మాకు చాలా ఎనర్జీ వచ్చింది. సినిమాపై మరింత కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మే 11న ప్రపంచవ్యాప్తంగా మా 'మెహబూబా' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

పూరి ఆకాశ్‌ సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

 

Facebook Comments
Mehbooba censored with UA, releasing on May 11th

About uma